ENGLISH

దాస‌రి ఆరోగ్యం ఎలా ఉంది?

01 February 2017-12:47 PM

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే.  కిడ్నిలు రెండూ ఇన్‌ఫెక్ష‌న్ కి గుర‌వ్వ‌డం వ‌ల్ల దాస‌రికి మంగ‌ళ‌వారం అత్య‌వ‌స‌రంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం అంతా  వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ప‌రిస్థితి కొంత ఆందోళ‌న‌క‌రంగా క‌నిపించింద‌ని కిమ్స్ డాక్ట‌ర్లే చెప్పారు. రెండు మూడు రోజుల్లో దాస‌రి ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వైద్యుల కృషి, అభిమానుల దీవెన‌లు ఫ‌లించాయి. దాంతో.. దాస‌రి ఆరోగ్యం బుధ‌వారం ఉద‌యానికి కాస్త కుదుట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వెంట‌లేట‌ర్‌ని కూడా తొల‌గించిన‌ట్టు, చికిత్స‌కు దాస‌రి స్పందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాసేప‌టి క్రిత‌మే వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ దాస‌రిని ప‌రామ‌ర్శించి వెళ్లిన‌ట్టు స‌మాచారం. దాస‌రి ప్రియ శిష్యుడు మోహ‌న్ బాబు అయితే గురువు గార్ని అనుక్ష‌ణం కంటికి రెప్ప‌లా చూసుకొంటున్నార‌ని తెలుస్తోంది.

ALSO READ: త‌దుప‌రి ఐటి శాఖ దాడి ఖైదీపైనేనా??