ENGLISH

ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్

22 July 2021-10:30 AM

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

 

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

 

ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

 

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

 

జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రాఫర్.

ALSO READ: స‌ముద్ర‌ఖ‌ని డిమాండ్ మామూలుగా లేదుగా