ENGLISH

2024లో సినిమా.. ఇప్పుడెందుకీ హంగామా.?

04 January 2021-09:17 AM

'యుగానికి ఒక్కడు' సినిమా గుర్తుందా.? కార్తీ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆండ్రియా, రీమాసేన్‌ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా చాలామందికి అర్థం కాలేదు. కానీ, అర్థమయినవారిలో కొందరికి ఇదొక అద్భుతం. అయితే, 'ఇంత పిచ్చి సినిమా ఇంతకు ముందెప్పుడూ చూడలేదు..' అని చాలామంది అనుకున్నారు. అంత పిచ్చిగా నటీనటులతో యాక్టింగ్‌ చేయించేశాడు దర్శకుడు సెల్వరాఘవన్‌. ఇప్పుడీ క్రియేటివ్‌ దర్శకుడు, ఆనాటి ఆ 'యుగానికి ఒక్కడు' సినిమాకి సీక్వెల్‌ తీయబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా వదిలారు. ధనుష్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడట.

 

ఎప్పుడు ప్రారంభమవుతుంది.? అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ, 2024లో అని ప్రకటించేశారు. దాన్ని బట్టి, సినిమా రిలీజ్‌ అయ్యేది 2024లో అనుకోవాలా.? లేదంటే, సినిమా ప్రారంభమయ్యేదే 2024లో అనుకోవాలా.? అన్నది అర్థం కావడంలేదు. మరోపక్క, ఈ సినిమా కోసం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖర్చుపెట్టబోతున్నారన్నది కోలీవుడ్‌లో విన్పిస్తోన్న మాట. ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. ధనుష్‌కి ఎలాగూ తెలుగులోనూ ఓ మోస్తరు క్రేజ్‌ వుంది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేశాడు. సో, దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా ఫిక్స్‌ అయిపోవచ్చు. కానీ, 'యుగానికి ఒక్కడు' పార్ట్‌ వన్‌లోలా 'అతి' చేస్తే మాత్రం కష్టం.

ALSO READ: ఆ దర్శ‌కుడిపై అల్లు ఫైర్‌?