ENGLISH

Dhanush: ధ‌నుష్ షాకింగ్ నిర్ణ‌యం.. విడాకులు వెన‌క్కి!

08 October 2022-12:15 PM

ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య‌కీ ధ‌నుష్‌కి పెళ్ల‌య్యింది. వాళ్లు ఇటీవ‌లే విడాకులు కూడా తీసుకొన్నారు. ఇప్పుడు ధ‌నుష్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకొన్నాడ‌ని స‌మాచారం. విడాకుల్ని ర‌ద్దు చేసుకొని, ఐశ్వ‌ర్య‌తో క‌లిసి జీవించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే.. ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ళ్లీ క‌లిసిపోతున్నార‌ని చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

ఐశ్వ‌ర్య‌తో ధ‌నుష్ విడాకులు తీసుకొన్న స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రికీ న‌చ్చ‌చెప్పాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ.. అటు ధ‌నుస్ గానీ, ఇటు ఐశ్వ‌ర్య గానీ ర‌జ‌నీ మాట విన‌లేదు. అయితే.. క్ర‌మంగా ఐశ్వ‌ర్య‌, ధ‌నుష్‌ల‌లో మార్పు మొద‌లైంది. మ‌ళ్లీ క‌లిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయానికి వ‌చ్చారు. ఇటీవ‌ల‌... ర‌జ‌నీకాంత్ నివాసానికి ధ‌నుష్ కుటుంబ స‌భ్యులు వ‌చ్చారు. ఇరు కుటుంబ పెద్ద‌ల స‌మ‌క్షంలో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ళ్లీ క‌లిసిపోవాల‌న్న నిర్ణ‌యం తీసుకొన్నార‌ని, త్వ‌ర‌లోనే... ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

ALSO READ: గాడ్ ఫాదర్ ,.. తమన్ ఆకలి తీరలేదు