ENGLISH

మెగాస్టార్ చిరంజీవి తప్పు చేసాడా?

11 August 2023-14:14 PM

భోళా శంకర్ మూవీ విడుదల సమయంలో తేనె తుట్టు లాంటి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడి చిరు తప్పు చేసాడా ?


పవన్ కల్యాణ్ కూడా ఇలాగే ఇంటిలిజెంట్ మూవీ ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం వల్ల ఆ సినిమా విడుదల మరియు కలెక్షన్స్ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురు అయ్యయో అందరూ చూశారు.

 
ఇప్పుడు భోళా శంకర్ మూవీ కి కూడా అవే పరిస్తితులు ఎదురు అవుతున్నాయా అనిపిస్తుంది! టికెట్ రేటు పెంపు విషయంలో నిర్మాతలు అనుకున్న రేటు పొందలేకపోయారు, పైగా అక్కడ ప్రభుత్వ అభిమానులు చిరు మూవీ పై నెగటివ్ ప్రచారం కూడా ఒక రేంజ్ లో స్టార్ట్ చెసారు.. ఆ ప్రభావం మూవీ పై, దర్శక నిర్మాతల మీద పడటం కాయం..  కానీ మూవీ కథ, కథనం బాగుంటే ఇవేమి సినిమాను ఏమి చెయ్యలేవు. 


ఇకనైనా రాజకీయాలు మాట్లాడాలంటే వేరే రాజకీయ సంబంధిత సభలో లేకపోతే ప్రెస్ మీట్ లో మాట్లాడటం ఉత్తమం. 


ఫైనల్ గా రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనేది అందరూ గుర్తిస్తే అందరికీ మంచిది.