ENGLISH

Dil Raju: `దిల్‌` ఖుష్‌... వార‌సుడొచ్చాడు

29 June 2022-14:13 PM

దిల్ రాజు ఇంట్లో సంబ‌రాలు నెల‌కొన్నాయి. కార‌ణం... ఆయ‌న ఇంటికి వార‌సుడొచ్చాడు. అవును.. దిల్ రాజుకి కొడుకు పుట్టాడు. దిల్‌రాజు త‌న భార్య అనిత మ‌ర‌ణంతో... రెండో పెళ్లి చేసుకొన్న సంగ‌తి తెలిసిందే. వ్యాఘ‌రెడ్డి మెడ‌లో ఆయ‌న మూడు ముళ్లూ వేశారు. 2020 మేలో వీరిద్ద‌రికీ పెళ్లి జ‌రిగింది. ఇప్పుడు... వ్యాఘారెడ్డి త‌ల్ల‌య్యారు. ఈరోజు ఉద‌యం ఓ పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. దిల్ రాజు తొలి భార్య‌కు ఓ కుమార్తె. ఇప్పుడు దిల్ రాజు ఇంటికి వార‌సుడు వ‌చ్చిన‌ట్టైంది.

 

దిల్ రాజు.. ఇటీవ‌ల దుబాయ్ వెళ్లారు. అక్క‌డి నుంచి ఈరోజు ఉద‌య‌మే హైద‌రాబాద్ తిరిగొచ్చారు. వ్యాఘ‌రెడ్డి... దిల్ రాజు సినిమాల‌కు సంబంధించిన కో ప్రొడ్యూస‌ర్‌గా, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూస‌ర్‌గానూ ప‌ని చేస్తున్నారు.

 

దిల్ రాజు ప‌నుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆమె పేరుతో కూడా సినిమాలుచేయాల‌ని దిల్ రాజు నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది.

ALSO READ: Virata Parvam: అయ్యో పాపం.. విరాట ప‌ర్వం