ENGLISH

దిల్‌రాజు ఇంట్లో... మోగింది పెళ్లి బాజా

17 December 2018-12:50 PM

టాలీవుడ్‌కి పెళ్లి క‌ళ వ‌చ్చింది. శ్వేతాబ‌సు ప్ర‌సాద్ పెళ్లి ఈమధ్యే జ‌రిగింది. ఇప్పుడు దిల్‌రాజు ఇంటికి పెళ్లి క‌ళ వ‌చ్చింది.

దిల్‌రాజు త‌మ్ముడు త‌న‌యుడు హ‌ర్షిత్ పెళ్లి నిశ్చ‌య‌మైంది.  దిల్ రాజు నిర్మించే చిత్రాల‌కు... నిర్మాణ బాధ్య‌త‌ల్ని చూసుకుంటాడు హ‌ర్షిత్‌.  రాజ్ త‌రుణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'ల‌వ‌ర్‌' చిత్రానికి త‌నే నిర్మాత‌.  ఆథోనీ ఎం.ఎల్‌.ఏ  వై. సాయి ప్ర‌సాద్ రెడ్డి త‌న‌య గౌత‌మితో  హ‌ర్షిత్ పెళ్లి కుదిరింది. ఇప్పుడు పెళ్లి ఘ‌డియ‌లు కూడా ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి.

ఈనెల 21 తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు గోవాలో పెళ్లి. అయితే ఈ పెళ్లికి ఆహ్వానాలు కొంత‌మందికే అందాయి. దిల్ రాజు సంస్థ‌లో ప‌ని చేసిన ద‌ర్శ‌కులంతా ఈ పెళ్లికి హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌, నానిల‌కు కూడా ఆహ్వానాలు అందాయి.  ఈనెల‌ 23న హైద‌రాబాద్‌లోని ఓం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో వివాహ విందు ఇస్తారు. ఆ విందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి. 

ALSO READ: శ‌ర్వానంద్ ఇంకా డిసైడ్ అవ్వ‌లేద‌ట‌..