ENGLISH

తొలి అనుభవం: రాజుగారు ముందే చెప్పేశారు.!

30 January 2020-15:30 PM

అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు దిల్‌రాజు. అయితే ఆయన ఇంతవరకూ రీమేక్స్‌ జోలికి పోలేదు. కథా బలాన్ని నమ్మి మాత్రమే సినిమాలు చేశారు. ఆయన తన సినిమాలో కథనే హీరోగా భావిస్తుంటారు. అయితే, తొలిసారి దిల్‌రాజును కదిలించిన రీమేక్‌ చిత్రం '96'. తెలుగులో 'జాను' టైటిల్‌తో రిలీజ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, ఈ సినిమా దిల్‌రాజుకు బాగా కనెక్ట్‌ అయ్యిందట. సినిమా రిలీజ్‌కి ముందే ఈ సినిమా ప్రివ్యూ షో చూసి, అప్పుడే రీమేక్‌కి ఫిక్స్‌ అయ్యారట.

 

సినిమాలో కొత్తదనం ఏమీ ఉండదు కానీ, ఖచ్చితంగా అందరూ ఈ స్టోరీకి తనలాగే కనెక్ట్‌ అవుతారు.. అని రాజుగారు ముందే చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో నటించేందుకు సమంత, శర్వా ఇద్దరూ మొదట ఓకే చెప్పలేదట. అందుకు కారణం ఇలాంటి క్లాసిక్‌ మూవీస్‌ని టచ్‌ చేస్తే రిజల్ట్‌ ఎలా ఉంటుందో అనే భయం. కానీ, పూర్తి నమ్మకాన్ని దిల్‌రాజుపై ఉంచి వీరిద్దరూ సినిమాకి కమిట్‌ అయ్యారట. అంతా బాగానే ఉంది. సినిమాకి ప్రీ రిలీజ్‌ టాక్‌ కాస్త అటూ ఇటూగా వస్తున్నా, ప్రమోషన్స్‌లో ఆ టాక్‌ని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు దిల్‌ రాజు అండ్‌ టీమ్‌.

 

ఈ దశాబ్ధంలోనే ఇలాంటి లవ్‌ స్టోరీ వచ్చింది లేదని అంటున్నారు. అంతగా ఈ లవ్‌స్టోరీకి ప్రతీ అమ్మాయీ, ప్రతీ అబ్బాయీ కనెక్ట్‌ అవుతారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే, సమంత కెరీర్‌లో ఇదో మంచి సినిమా అవుతుంది. అలాగే శర్వా - దిల్‌రాజు కాంబినేషన్‌ లిస్టులో ఓ మంచి హిట్‌ వచ్చి చేరుతుంది. ఒరిజినల్‌ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఈ రీమేక్‌ని టేకప్‌ చేసిన సంగతి తెలిసిందే.

ALSO READ: నేనిచ్చే ఏకైక స‌ల‌హా అదే! - వ‌ర్ష బొల్ల‌మ్మ ఇంటర్వ్యూ