ENGLISH

Thank you: ఫ్లాప్ అయినా - సేఫ్‌జోన్‌లోనే ఉన్నారా?

23 July 2022-16:32 PM

టాలీవుడ్ కి ఈమ‌ధ్య టైమ్ క‌ల‌సి రావ‌డం లేదు. వ‌రుస‌గా ఫ్లాపులే ఎదుర‌వుతున్నాయి. జూలైలో ఒక్క హిట్టు కూడా న‌మోదు కాలేదు. ఆఖ‌రికి దిల్ రాజు థ్యాంక్యూ కూడా అట‌కెక్కేసింది. సినిమాకి ఫ్లాప్ టాక్ రావ‌డం ఒక ఎత్త‌యితే, భారీ వ‌ర్షాల వ‌ల్ల కూడా జ‌నాలు థియేటర్ల‌కు రావ‌డం లేదు. ఏపీ తెలంగాణాల‌లోనే కాదు, ఓవ‌ర్సీస్‌లోనూ వ‌సూళ్లు నీర‌సంగానే ఉన్నాయి. దాంతో ఈ సినిమాతో దిల్ రాజుకి భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ట్రేడ్ వ‌ర్గాలు ఓ అంచ‌నాకి వ‌చ్చేశాయి.

 

కాక‌పోతే... ఈ సినిమా విష‌యంలో దిల్ రాజు సేఫ్ జోన్ లోనే ఉన్నార్ట‌. రూ.30 కోట్ల‌తోనే ఈ సినిమా ముగించార‌ని, సోనీ లీవ్‌కి రూ.12 కోట్ల‌కు ఓటీటీ అమ్మేశార‌ని తెలుస్తోంది. మిగిలిన డిజిట‌ల్‌, శాటిలైట్ రూపంలో.. మ‌రో రూ.6కోట్ల వ‌ర‌కూ వ‌స్తున్నాయ‌ట‌. అంటే.. మ‌రో 12 కోట్లు వ‌స్తే గ‌ట్టెక్కేయొచ్చు. ఏపీ,. తెలంగాణ‌లో త‌న‌కు బాగా కావ‌ల్సిన బ‌య్య‌ర్ల‌కే ఈ సినిమాని త‌క్కువ రేటుకి అమ్మార్ట‌. అలా.. ఈ సినిమా విష‌యంలో దిల్ రాజు లాభాలు చూసుకోకుండా ముందే సెటిల్ చేసుకొన్నార‌ని, దాంతో.. ఈసినిమా ఫ్లాప్ అయినా, త‌న‌కు పెద్దగా న‌ష్టాలు రాలేద‌ని స‌మాచారం.

ALSO READ: మ‌హేష్ బ‌ర్త్ డే గిఫ్ట్‌: పోకిరి... రీ రిలీజ్‌!