ENGLISH

ప‌వ‌న్ సినిమాలో... కొత్త హీరోయిన్‌

15 February 2022-13:00 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. అదే.. `భ‌వ‌దీయుడు.. భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు త‌ర‌వాత ప‌వ‌న్ ప‌ట్టాకెక్కించే సినిమా ఇదే. ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే ని ఎంచుకున్న‌ట్టు ఓ టాక్‌. ఇప్పుడు మ‌రో క‌థానాయిక‌కీ చోటు కల్పించారట‌. డింపుల్ హ‌య‌తిని సెకండ్ హీరోయిన్‌గా ఎంచుకున్నార‌ని స‌మాచారం అందుతోంది.

 

ఖిలాడిలో మెరిసిన భామ డింపుల్ హ‌య‌తి. ఇది వ‌ర‌కు రెండు మూడు సినిమాలు చేసినా, పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఖిలాడి ఫ్లాప్ అయినా.. త‌న స్కిన్ షోతో అద‌ర‌గొట్టింది. హాట్ హాట్ ముద్దు సీన్ల‌లో క‌నిపించి.. తాను ఎలాంటి పాత్ర‌కైనా రెడీ అనే సంకేతాలు ఇచ్చింది. `భ‌గ‌త్ సింగ్‌`లో గ్లామ‌ర్ డాల్ లాంటి ఓ పాత్ర ఉంద‌ట‌. దానికి డింపుల్ అయితే సరిగ్గా స‌రిపోతుంద‌ని హ‌రీష్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. గోపీచంద్ - శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో కూడా డింపుల్ హీరోయిన్ గా ఎంపికైన‌ట్టు స‌మాచారం. మొత్తానికి సినిమా ఫ్లాప్ అయినా.. డింపుల్ కి మాత్రం అవ‌కాశాల‌కు కొద‌వ లేకుండా పోయింది.

ALSO READ: మ‌హేష్‌పై బాలీవుడ్ కి న‌మ్మ‌కం లేదా?