ENGLISH

క‌రోనాతో తెలుగు ద‌ర్శ‌కుడు మృతి

26 April 2021-17:00 PM

క‌రోనా మ‌రొక‌రిని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.సాయి బాలాజీ క‌రోనాతో మృతి చెందారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని టిమ్స్‌లో ఆస్ప‌త్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారాయ‌న‌ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. 'శివాజీ' , 'ఒరేయ్ తమ్ముడు` చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిరంజీవి న‌టించిన 'బావగారు బాగున్నారా' సినిమాకు స్క్రీన్ ప్లే రచయిత గా ప‌నిచేశారు.

 

కొన్ని టీవీ సీరియల్స్ కూడా రూపొందించారు. సిరి, అపరంజి, హాలాహలం సీరియల్స్ ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. తిరుప‌తి వాసి అయిన బాలాజీ, ర‌విరాజా పినిశెట్టి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశారు. ఆ త‌ర‌వాత ర‌చ‌యిత‌గా కొన్ని సినిమాల‌కు ప‌నిచేశారు. ప్రస్తుతం బుల్లి తెర కోసం సీరియ‌ల్స్‌నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. బాలాజీ మృతికి చిత్ర‌సీమ ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేసింది.

ALSO READ: పుష్ష‌లో మ‌రో హీరోయిన్‌