ENGLISH

తేజ త‌న‌యుడి అరంగేట్రం..?!

23 February 2021-14:27 PM

ద‌ర్శ‌కుడిగా తేజ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ముద్ర వేసుకున్నారు. ఎప్పుడూ.. హీరోల వెంట ప‌డ‌లేదు. స్టార్ల జోలికి వెళ్ల‌లేదు. కొత్త‌వాళ్ల‌తోనే ప్ర‌యోగాలు చేశారు. అవే.. ఆయ‌న‌కు విజ‌యాల్నీ అందించాయి. చిత్రం సినిమాతో ఎంతోమంది ప్ర‌తిభావంతుల్ని ప‌రిచ‌యం చేశారు తేజ‌. ఇప్పుడాయ‌న `చిత్రం`కి సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ల‌ను కొత్త‌వాళ్ల‌నే ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు.

 

 అయితే.. ఈ సినిమాతో తేజ త‌న‌యుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని టాక్‌. తేజ కి ఓ కుమారుడు, ఓ కుమార్తె. త‌న‌యుడి పేరు అమిత‌వ్ తేజ. న్యూయార్క్ లో చ‌దువుకున్నాడు. న‌ట‌న‌లోనూ శిక్ష‌ణ తీసుకున్నాడ‌ట‌. త‌న కోస‌మే తేజ‌.. `చిత్రం 1.1` తీస్తున్నాడ‌ని టాక్‌. హీరో త‌న ఇంట్లోంచి వ‌చ్చినా, మిగిలిన‌వాళ్లంద‌రినీ కొత్త‌వాళ్ల‌నే ఎంచుకోవాల‌ని భావిస్తున్నాడు అందుకోసం... ఆడిష‌న్స్ కూడా చేయ‌బోతున్నాడ‌ట‌. మ‌రి.. తేజ త‌న‌యుడి ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ: ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి ఛాన్స్ ఇచ్చిన నితిన్‌