ENGLISH

తేజ మళ్లీ అదే రూటులో వెళతాడా?

21 August 2017-18:39 PM

కొత్త వాళ్లతో సినిమా తెరకెక్కించడం అంటే డైరెక్టర్‌ తేజకి సరదా. అలా చేసిన చాలా ప్రయోగాలు బెడిసికొట్టాయి కూడా. అయినా కానీ ఆయనకు కొత్త నటీనటలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్న కోరిక ఇంకా తీరడం లేదట. లేటెస్టుగా రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాని తెరకెక్కించాడు రానా. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. దాంతో తేజ రూటు మార్చాడనుకున్నారంతా. పెద్ద బ్యానర్స్‌, స్టార్‌ హీరోల వైపు తేజ ఇంట్రెస్ట్‌ చూపిస్తాడేమో అనుకున్నారు. కానీ తేజ మళ్లీ తన బాటలోనే నడుస్తానంటున్నాడు. త్వరలోనే కొత్త వాళ్లతో మరో సినిమా తెరకెక్కిస్తానంటున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తెచ్చిన సక్సెస్‌తో తేజకి కొత్త ఉత్సాహం వచ్చింది. బిగ్‌ బ్యానర్‌లో ఓ చిన్న సినిమాని రూపొందించనున్నాడట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నాడు తేజ. డైరెక్టర్స్‌ అందరిలోనూ తేజ రూటే సెపరేటు. ఎవరి మాటా వినడు తేజ .అయితే తాను టేకప్‌ చేయబోయే ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఓ ప్రముఖ హీరో నటించనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లోనే తెరకెక్కుతుందట. చాలా కాలం తర్వాత తేజ నుండి వచ్చిన సినిమా 'నేనే రాజు నేనే మంత్రి'. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా ఇది. రానాకి జంటగా కాజల్‌ అగర్వాల్‌, కేథరీన్‌ నటించారు. సీనియర్స్‌తో తేజ చేసిన ప్రయోగం ఫలించింది. అలాగే ఇకపై కూడా తేజ ఆలోచనలు ఆ రేంజ్‌లో ఉంటే, మరిన్ని మంచి సినిమాలు తేజ నుండి ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చేమో అనుకుంటున్నారు ఆయన అభిమానులు. మరి మన క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ ఏం చేస్తాడో చూడాలిక.

ALSO READ: జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుమాధవ్..!!