ENGLISH

రవితేజ పరిస్థితి చివరికి ఇలా తయారయింది..!

26 May 2018-17:54 PM

'నేల టికెట్టు'తో రవితేజ మార్కెట్‌ పూర్తిగా పడిపోయిందని టాక్‌ వచ్చేసింది. అసలే బ్యాడ్‌ టైం నడుస్తున్న ఈ తరుణంలో రవితేజ ఈ సినిమా చేసుండకపోయి ఉండాల్సిందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అసలే పోటీ పెరిగిపోయింది. మూస కథలను ఆడియన్స్‌ ఎంకరేజ్‌ చేయడం లేదు. కొత్త తరహా కథలకే పట్టం కడుతున్నారు. 

అలాంటిది ఇంకా నేను ఈ రొటీన్‌ మాస్‌ కథలనే నమ్ముకుంటానంటే రవితేజ రేస్‌లో ముందుకెళ్లేదెలా? యంగ్‌ హీరోలు కొత్త కథలతో దూసుకెళ్తున్నారు. స్టార్‌ హీరోలు కూడా కొత్త కాన్సెప్ట్‌లతో యంగ్‌ హీరోస్‌కీ గట్టి పోటీ ఇస్తున్నారు. మూస కథలనే నమ్ముకున్న అల్లరి నరేష్‌ వంటి వారికి కెరీర్‌ లేకుండా పోయింది. అలాంటిది రవితేజ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఇకపై తాను ఎంచుకునే కథల విషయంలో మాస్‌ రాజా కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించక తప్పదనిపిస్తోంది.

ఈ మధ్యనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన రవితేజకు 'రాజా ది గ్రేట్‌' ఫర్వాలేదనిపించినా, 'టచ్‌ చేసి చూడు'తో అస్సలు టచ్చే లేకుండా పోయింది. ఈ 'నేల టిక్కెట్టు' రవితేజని విమర్శల్లో పడేసింది. హ్యాట్రిక్‌ కొడతాడని భావించిన డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణకు దారుణంగా నిరాశను మిగిల్చింది 'నేల టిక్కెట్టు'. 

చూడాలి మరి నెక్ట్స్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందో. అసలే ఇందులో రవితేజ ట్రిపుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. సెంటిమెంట్‌ పరంగా చూస్తే, ట్రిపుల్‌ రోల్‌ స్టోరీలు ఏ హీరోకీ పెద్దగా సక్సెస్‌నిచ్చిన దాఖలాలు లేవు. మరి రవితేజ ఏం చేస్తాడో చూడాలిక.

ALSO READ: ఫ్లాప్‌ అని తేల్చేసిన నాని