ENGLISH

ఈ సారి ఎన్టీఆర్‌ ఢీకొట్టబోయే విలన్‌ ఎవరంటే.!

16 March 2018-16:30 PM

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకి విలన్‌గా ఎవర్ని ఎంచుకోవాలనే యోచనలో చిత్ర యూనిట్‌ సీరియస్‌ ఆలోచన చేస్తోందట. అయితే టాలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న విలన్‌ హ్యాండ్‌సమ్‌ జగపతిబాబు. అయితే జగపతిబాబు - ఎన్టీఆర్‌ కలిసి 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఆల్రెడీ ప్రత్యర్ధులుగా తలపడ్డారు. క్లాస్‌ మూవీగా తెరకెక్కిన ఆ సినిమాలో ఇద్దరూ స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టేశారు. అందులోనూ హిట్‌ కాంబినేషన్‌గా పేరు కూడా వచ్చింది. 

సో త్రివిక్రమ్‌ సినిమాకి కూడా జగపతిబాబునే విలన్‌గా ఎంచుకోవాలా అని అనుకుంటున్నారట. మరో పక్క ఫ్రెష్‌నెస్‌ కోసం బాలీవుడ్‌ విలన్స్‌ని కానీ, యంగ్‌ స్టర్స్‌ని ఎవరైనా విలన్స్‌గా మార్చాలా అనే ఆలోచనలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 'అజ్ఞాతవాసి' బెడిసికొట్టడంతో త్రివిక్రమ్‌కి ఎన్టీఆర్‌ సినిమా ప్రెస్టీజియస్‌ మూవీ అయిపోయి కూర్చుంది. దాంతో ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆచి తూచి అడుగులు వేస్తున్నాడట త్రివిక్రమ్‌. అందుకే విలన్‌ విషయంలో ఎక్కువ ప్రెజర్‌ ఫీలవుతున్నాడట. 

అయితే టాలీవుడ్‌కి సంబంధించినంత వరకూ ప్రజెంట్‌ ట్రెండింగ్‌ విలన్‌ అంటే జగపతిబాబు పేరే చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆల్రెడీ హిట్‌ అయిన కాంబినేషన్‌ కాబట్టి, జగపతిబాబుకే త్రివిక్రమ్‌ ఓటేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో ట్రెండీ అండ్‌ స్మార్ట్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ కసరత్తులు మొదలెట్టేశాడు. 'డీజె' సినిమాతో హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్దే, ఎన్టీఆర్‌కి జోడీగా ఓకే అయిపోయింది. మ్యూజిక్‌ కోసం ముందుగా అనుకున్న అనిరుధ్‌ని పక్కన పెట్టేసి, ధనాధన్‌ తమన్‌ని లైన్‌లో పెట్టేశారు. 

ఇక రేపో మాపో సినిమా సెట్స్‌మీదికెళ్లడమే తరువాయి.

ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్