ENGLISH

అప్పుడో మాట ఇప్పుడో మాట ఎందుకంట

01 June 2017-15:35 PM

నిత్యామీనన్‌ నటనలో ఆమెకి ఆమెకే సాటి. ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోగలదు ఈ ముద్దుగుమ్మ. అయితే స్టార్‌డమ్‌ మాత్రం సంపాదించుకోలేకపోతోంది. ఇదంతా పక్కన పెడితే, అప్పుడెప్పుడో ఈ షార్ట్‌ బ్యూటీ ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తనకి డైరెక్షన్‌ చేయాలని ఉందని. త్వరలోనే తన డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తుందని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు పాత్రలో ఈజీగా ఒదిగిపోయినట్లే ఈజీగా ప్లేటు మార్చేసింది. తను డైరెక్షన్‌ మాట ఎప్పుడూ ఎత్తలేదంటోంది. యాక్టింగ్‌ పైనే తన ఫుల్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ అంటోంది. నటన అనేది అనంతం. ఎంత నేర్చుకున్నా, అందులో నేర్చుకోవాల్సింది కొండంత ఉంటుంది అంటోంది ముద్దుగుమ్మ నిత్యామీనన్‌. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, పలు విలక్షణ పాత్రల్లో కూడా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే 'జనతా గ్యారేజ్‌' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. మొదట్లో సెకండ్‌ హీరోయిన్‌ అని ప్రచారం జరిగినా, కానీ మెయిన్‌ హీరోయిన్‌ రోలే నిత్యా పోషించిందని సినిమా విడుదలయ్యాక తెలిసింది. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది ఆ సినిమా. అంతటి విజయాన్ని అందుకున్నా కానీ, నిత్యకు అవకాశాలు జోరందుకోలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కినట్లే దక్కి చేజారిపోయింది నిత్యామీనన్‌కి. అయినా కానీ క్యూట్‌గా ఉంటుంది కదా అవకాశాలు ఏదో మూల నుండి వచ్చేస్తాయి మన క్యూట్‌ అండ్‌ షార్ట్‌ బ్యూటీ నిత్యాకి. 

ALSO READ: ఆగ్రహించిన ఆలు అర్జున్