ENGLISH

హీరోయిన్‌గా రాజశేఖర్‌ కుమారై

31 May 2017-17:55 PM

రాజశేఖర్‌ - జీవిత దంపతుల ప్రధమ కుమారై అయిన శివానిని హీరోయిన్‌గా తెరంగేట్రం చేయాలని ఎప్పట్నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య ఓ సినిమాలో శివాని హీరోయిన్‌గా నటించబోతోందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ మాటకు బలం చేకూరింది. ఎందుకంటే రాజశేఖర్‌ తనయ శివాని లేటెస్ట్‌ ఫోటో షూట్స్‌ చూస్తుంటే అంతా అలానే అనుకుంటారు మరి. గతంలో పలు బహిరంగ వేడుకల్లో శివాని తళుక్కున మెరిసింది. దాంతో ఆమె గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. కానీ తాజాగా ఆమె ఫోటోస్‌ చూస్తుంటే ఎవరీ భామ.. బాలీవుడ్‌ నుండి వచ్చిందా? అనుకోకుండా ఉండలేకపోతున్నారు. కొన్ని యాంగిల్స్‌లో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రాలాగా, మరి కొన్ని యాంగిల్స్‌లో కోలీవుడ్‌ నేచురల్‌ బ్యూటీ అమలాపాల్‌లాగా అనిపిస్తోంది. అసలింతకీ ఈ భామ రాజశేఖర్‌ కూతరు శివానియేనా.. ఇంత గ్లామరస్‌ లుక్‌లో కనిపిస్తోంది అంటూ అనుమానాలొస్తున్నాయి. అంతగా అందరి దృష్టినీ ఎట్రాక్ట్‌ చేస్తోంది ముద్దుగుమ్మ శివాని. ఈ ఫోటో క్లిప్పింగ్స్‌ చూస్తుంటే రాజశేఖర్‌ తనయ శివాని తెరంగేట్రానికి సర్వం సిద్ధమైనట్లే అనిపిస్తోంది. ఫీచర్స్‌, గ్లామర్‌ పరంగా అమ్మడు సూపర్బ్‌ అనిపిస్తోంది. తండ్రి రాజశేఖర్‌ యాంగ్రీ యంగ్‌మెన్‌గా, తల్లి జీవిత మంచి నటిగా, డైరెక్టర్‌గా తమ టాలెంట్‌ తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. మరి తాజాగా ఈ జంటకి ముద్దుల కూతురైన శివాని యాక్టింగ్‌ పరంగా తన టాలెంట్‌ని ఎలా ప్రదర్శిస్తుందో చూడాలిక. 

 

ALSO READ: స్పైడర్ చిత్ర టీజర్ విడుదల సమయంలో మార్పు