ENGLISH

టిల్లు గాడి రొమాన్స్ ఈసారి బీభ‌త్స‌మ‌ట‌!

26 June 2022-13:30 PM

చిన్న సినిమాగా విడుద‌లై... పెద్ద విజ‌యాన్ని అందుకొంది డీజే టిల్లు. రూ.4 కోట్ల‌తో ఈ సినిమా తీస్తే.. రూ.30 కోట్లు వ‌చ్చాయి. వినోదం, క్రైమ్‌, రొమాన్స్ మిక్స్ చేసిన ఈ వంట‌కం.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా న‌చ్చింది. హైద‌ర‌బాదీ స్లాంగ్ తో.. డీజే టిల్లుగా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు ఈ సినిమా కి పార్ట్ 2 మొద‌ల‌వుతుంది. డీజే టిల్లు పార్ట్ 2 ఉంటుంద‌ని... డీజే టిల్లు క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ‌. ఈ సినిమా హిట్ట‌వ‌డంతో పార్ట్ 2కి శ్రీ‌కారం చుట్టారు. ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభం కానుంది. వ‌చ్చే యేడాది ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

 

డీజే టిల్లు మొత్తం హైద‌రాబాద్ నేప‌థ్యంలోనే సాగింది. పార్ట్ 2 మాత్రం ఫారెన్ లో షూట్ చేస్తార్ట‌. రెండో భాగం మొత్తం విదేశాల్లోనే షూటింగ్ చేస్తార‌ని స‌మాచారం. ఈసారి రొమాన్స్‌కి పెద్ద పీట వేయ‌నున్నార‌ని తెలుస్తోంది. డీజే టిల్లు లో రొమాన్స్ ఉంది. లిప్ లాక్‌లూ చూపించారు. ఈసారి ఆ డోసు ఇంకాస్త ఎక్కువ కానుంద‌ట‌. డీజే టిల్లు పార్ట్ 2లో కొత్త పాత్ర‌లు వ‌స్తాయ‌ని, అవి కావ‌ల్సినంత వినోదం పంచి పెడ‌తాయ‌ని తెలుస్తోంది. డీజే టిల్లు రూ.4 కోట్ల‌లో తీశారు. అయితే... పార్ట్ 2కి మాత్రం ఎక్కువ ఖర్చు పెట్ట‌బోతున్నార‌ట‌. స్క్రిప్టు డిమాండ్ చేయ‌డం వ‌ల్లే... బ‌డ్జెట్ పెరిగింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: విక్ర‌మ్ ట్విస్ట్‌: రోలెక్స్ విల‌న్ కాదు.... హీరో!