ENGLISH

డార్లింగ్ తో దుల్కర్?

29 April 2024-23:06 PM

ప్రజంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి. పాత తరం నటీ నటులు ఎక్కువగా ఇలా మల్టీ స్టారర్ సినిమాలు చేసారు. 90 లో ఈ ఒరవడి తగ్గింది. మళ్ళీ ఈమధ్య కాలంలో మల్టీ స్టారర్ కి ఆదరణ పెరిగింది. ప్రజంట్ పానిండియా సినిమాలు రాజ్యమేలుతున్న కారణంగా అన్ని భాషలకి చెందిన హీరోలు కలిసి నటిస్తున్నారు. ఏ భాష అన్నది అనవసరం అది సినిమా అయితే చాలు అనుకుంటున్నారు. సొంత భాషలో సూపర్ స్టార్స్ అయినా పర భాషలో నటించాల్సి వస్తే, విలన్ , గెస్ట్ రోల్, కీ రోల్ అని చూడకుండా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 


బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నారు. సౌత్ హీరోలు మిగతా భాషల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సాల్మన్ సొంత భాషా సినిమాలతో పాటు, హిందీ,  తెలుగు,  తమిళం, మలయాళం , సినిమాల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన దుల్కర్ తెలుగులో నేరుగా సీతా రామం సినిమాతో అలరించారు. అంతకుముందు మళయాలం లో నటించిన మూవీస్ డబ్బింగ్ తో తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇపుడు తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీ గా ఉన్నాడు దుల్కర్. తేజ సజ్జా మిరాయ్ లో దుల్కర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ అందుకున్నట్లు  తెలుస్తోంది. 


ప్రభాస్, హను  రాఘవపూడి ల కాంబోలో ఒక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఒక కీలకమైన పాత్ర కోసం దుల్కర్ ని సంప్రదించినట్లు సమాచారం. హను రాఘవపూడి, దుల్కర్ కాంబోలో వచ్చిన సీతా రామం భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీనితో దుల్కర్ కూడా ఈ ఆఫర్ కి ఓకే  చెప్పినట్టు టాక్. దుల్కర్ ఈ మూవీలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారన్న సంగతి  ఇంకా తెలియాల్సి ఉంది.