ENGLISH

నీట్‌గా క్యూట్‌గా కుమ్మేశారంతే!

30 May 2017-12:14 PM

'డీజె' నుండి రెండో ఆడియో సింగిల్‌ వచ్చేసింది. మొదటి ఆడియో సింగిల్‌లో హీరో ఇంట్రడక్షన్‌తో ఇరగదీసేస్తే, రెండో ఆడియో సింగిల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపించేలా ఉంది. అంత అందంగా ఉంది ఈ ఆడియో సింగిల్‌. వినడానికి విన సొంపైన మ్యూజిక్‌, చూడడానికి అయితే రెండు కళ్లూ చాలడం లేదు. అల్లు అర్జున్‌ డాన్స్‌ల్లో ఇరగదీస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ స్టెప్పులు చాలా అందంగా కొత్తగా ఉన్నాయి. ఈ పాటలో విజువల్‌గా చెప్పుకోవల్సింది పూజా హెగ్దే గ్లామర్‌. ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ గురించి ఇంతవరకూ చర్చించుకున్న మాటలన్నీ వాస్తవాలే. ఈ ఒక్క పాటలోనే ఆమె అందం ఇంత అందంగా ఉంటే, ఇక సినిమా మొత్తం ఇంకెంత అందంగా ఉంటుందో అని ఆశక్తి చూపుతున్నారు ఆడియన్స్‌. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో బీట్స్‌ అదిరిపోతున్నాయి. బీట్‌కి తగ్గట్లుగా అల్లు అర్జున్‌, పూజా హెగ్దే జంట అందంగా నర్తిస్తుంటే ఆ అందం గురించి చెప్పడానికి సామాన్యులు చాలేలా లేరు. ఓ అందమైన శిల్పంలా ఆమె నర్తన, చూపరులకు చాలా ఆనందం కలిగిస్తోంది. రెప్పలు వేయకుండా అలా పూజా హెగ్దే డాన్స్‌ని ఎంజాయ్‌ చేస్తుండడమే ఆడియన్స్‌ వంతవుతోంది. ఇది ఇంకా జస్ట్‌ ఈ సాంగ్‌కి ట్రైలర్‌ మాత్రమే. ఇక మొత్తం సాంగ్‌ చూస్తే ఇంకెంతలా ఉంటుందో.. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ALSO READ: మామ ప్లేస్ లో కోడలు!