ENGLISH

మా సినిమా రావ‌డం లేదు.. మీరూ బ‌య‌ట‌కు రావొద్దు

27 April 2021-13:00 PM

బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు.. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ చెప్తున్నారు ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్. ఎప్రిల్ 30న రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లోనే ఏక్ మినీ కథ సినిమా నిర్మాణం పూర్తైంది. యూవీ కాన్సెప్ట్స్ తో పాటు మ‌రో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

 

ఈ సినిమాను ఎప్రిల్ 30న విడుదల చేస్తామంటూ ఇదివరకే దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే హీరో సంతోష్ శోభన్, నటుడు సుదర్శన్ కలిసి ఓ సరదా వీడియో కూడా చేసారు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత కొత్త తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలంటూ కోరారు హీరో సంతోష్ శోభన్.

ALSO READ: ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌విత్వం.. ఎవ‌రి కోస‌మో తెలుసా?