ENGLISH

భయపెడుతూ నవ్వించేసిన 'గది'

20 September 2017-12:04 PM

నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాజుగారి గది - 2'. ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. నాగార్జున నటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ట్రైలర్‌ వచ్చాక ఆ అంచనాలు రెట్టింపయ్యాయనే చెప్పాలి. ట్రైలర్‌లో ఓ అమ్మాయి ఆత్మ భయపెట్టిస్తోంది. ఆ ఆత్మ ఎవరో కాదు సమంత అనిపిస్తోంది. సమంత ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆ ఆత్మే సమంత అయితే సమంతకి డిఫరెంట్‌ రోల్‌ దక్కింది ఈ సినిమా ద్వారా అని భావించొచ్చు. ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. క్యూట్‌గా హాట్‌గా కనిపిస్తోంది సీరత్‌. ఓంకార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'రాజుగారి గది' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగార్జునతో పాటు అశ్విన్‌, రాజేష్‌, షకలక శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. దయ్యాన్ని చూసి వాళ్లు భయపడే తీరు మనల్ని కొంచెం భయపెట్టిస్తూనే, నవ్విస్తుంది. మొదటి సీక్వెల్‌కి కనెక్షన్స్‌ బాగానే ఉన్నాయనిపిస్తోంది. నాగార్జున తొలి సారిగా హారర్‌ కామెడీ మూవీలో నటిస్తోన్న సినిమా ఇది. మానసిక వైద్య నిపుణుడిగా నటిస్తున్నాడు నాగార్జున. కళ్లలోకి చూస్తూ మనసులో ఏముందో తెలసుకోగల వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు. ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ALSO READ: దర్శకుడ్ని కాదు, నటుడ్ని మాత్రమే: ఎన్టీఆర్