ENGLISH

పాయల్‌ ఘోష్‌, జస్ట్‌ పబ్లిసిటీ స్టంటేనా?

21 September 2020-15:00 PM

తెలుగులో ‘ప్రయాణం’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బబ్లీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుట్‌ ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ రోల్‌లో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెద్దగా తెలుగు తెరపై ఎక్కడా కనిపించిన దాఖలాల్లేవు. ఇక, ఈ బ్యూటీ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌గా మారింది. అందుక్కారణం, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించడమే. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, పాయల్‌ ఘోష్‌కి అండగా నిలవగా, తాప్సీ.. అనురాగ్‌ కశ్యప్‌ చాలా మంచోడని చెబుతోంది.

 

చూస్తోంటే, ఇది ‘మీటూ’ తరహా పబ్లిసిటీ స్టంట్‌ అనిపిస్తోందన్నది చాలామంది అభిప్రాయం. కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకపోవడంతో, పాయల్‌ ఈ రూట్‌ ఎంచుకుందనీ, పనిగట్టుకుని దుష్ప్రచారానికి దిగుతోందని కొందరు బాలీవుడ్‌ సినీ జనం ఆరోపిస్తున్నారు. గతంలో తనూశ్రీ దత్తా ఇదే తరహాలో సంచలన ఆరోపణలు చేయడం, పలువురు సినిమా అవకాశాలు కోల్పోవడం తెలిసి విషయాలే. దేశవ్యాప్తంగా మీ టూ రచ్చ.. కొందరు రాజకీయ నాయకుల్నీ ఇరకాటంలో పడేసింది. అయితే, గతంలోలా ఈ సారి ‘మీటూ’ రచ్చ అంత స్థాయికి వెళ్ళే అవకాశం కనిపించడంలేదు.

 

పైగా, పాయల్‌ చేసిన ఆరోపణలకి పెద్దగా ఎవరూ మద్దతివ్వడంలేదు. ఎలాగోలా వార్తల్లోకెక్కాలన్న తాపత్రయం తప్ప, పాయల్‌ ఆరోపణల్లో నిజం కనిపించడంలేదంటూ పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో పాయల్‌ సహా కంగన ఒకింత డీలా పడ్డారట.

ALSO READ: ప్ర‌భాస్ కోసం సింగీతం స‌హాయం