ENGLISH

వెండితెరపై మరో 'పుత్రరత్నం'

05 June 2017-16:54 PM

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తనయుడు నిఖిల్‌ గౌడ 'జాగ్వార్‌' అనే సినిమాలో నటించాడు. నిఖిల్‌ గౌడ ఎంట్రీకి భారీ పబ్లిసిటీ చేశారు ఈ సినిమాతో. కన్నడతో పాటు తెలుగులో కూడా అనువాదమయ్యింది ఈ సినిమా. అనువాద చిత్రమే కానీ, డైరెక్ట్‌ తెలుగు సినిమాగా ఈ సినిమాకి తెలుగులో ప్రమోషన్స్‌ నిర్వహించారు. తెలుగులో ప్రముఖ తారల మెప్పు పొందాడు విడుదలకి ముందే ఈ సినిమాతో నిఖిల్‌ గౌడ. భారీగా ఖర్చు చేసి ఆ సినిమా రూపొందించారు. అయితే సినిమా బోల్తా కొట్టేసింది. మహాదేవ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ప్రస్తుతం నిఖిల్‌ గౌడ రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసారి చేతన్‌కుమార్‌ దర్శకత్వంలో నిఖిల్‌ సినిమా రూపొందనుంది. ఇదంతా నిఖిల్‌ గౌడ హీరో ఎంట్రీ గాధ అయితే, తాజాగా ఇప్పుడు మరో కర్నాటక బుల్లోడు హీరోగా సినిమాల్లోకి భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన మరింకెవరో కాదు కర్నాటకకు చెందిన రాజకీయ ప్రముఖుడు గాలి జనార్దన్‌రెడ్డి తన కుమారుడు కిరీటి. కిరీటి హీరోగా ఓ సినిమా రాబోతోంది. ప్రస్తుతం తన కుమారున్ని హీరోగా చూపించే దర్శకుడి వేటలో పడ్డాడు గాలి జనార్థన్‌రెడ్డి. అపర కుబేరుడు. బడ్జెట్‌ 100 కోట్లు ఆ పైనే ఉంటుందట. ఈ సినిమాని తెలుగు, కన్నడతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ చేస్తారని సమాచారమ్‌. ఎన్ని డబ్బులుంటే ఏం లాభం? టాలెంట్‌ ఉండాలి కదా..చూద్దాం కిరీటి ఏం చేస్తాడో! 

 

ALSO READ: మ‌రక‌త‌మ‌ణి మెర‌వాల్సిందే!