ENGLISH

శంకర్ కి ఏమైయింది ?

28 March 2023-11:00 AM

శంకర్ సినిమా అంటే అదొక బ్రాండ్. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి విడుదలైన వరకూ అందరిద్రుష్టి దానిపైనే వుంటుంది. ఇక ప్రమోషన్స్ లో కూడా శంకర్ తన మార్క్ చూపిస్తారు. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ వైరల్ అవుతుంటుంది. చిన్న లుక్ బయటికి వచ్చిన అది ట్రెండ్ అయిపోతుంటుంది. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆయన చేస్తున్న సినిమాకి ఆది లోనే షాక్ తిన్నారు ఫ్యాన్స్.

 

ఈ సినిమాకి చాలా టైటిల్స్ అని వినిపించాయి. అందులో ఆసక్తికరమైన టైటిల్స్ కొన్ని వున్నాయి.కానీ అన్నీ అంచనాలు తలకిందులు చేస్తూ గేమ్‌ చేంజర్‌ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ లో ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. ఎన్నికల నేపధ్యంలో సాగే ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ గా ఉన్నప్పటికీ అదేదో డబ్బింగ్ సినిమా సౌండ్ కొట్టింది ఈ టైటిల్ లో. ఇక ఫస్ట్ లుక్ ఇంకా షాక్. చరణ్ బైక్ పై కూర్చిని వెనక్కి తిరిగి చూస్తూండగా ఫోటో తీసి దాన్నే ఫస్ట్ లుక్ అని వదిలేసినట్లుగా వుంది కానీ శంకర్ యూనిక్ నెస్ ఇందులో కనిపించలేదు. చరణ్ ఫస్ట్ లుక్ పై బోలెడు అంచనాలు ఉండేవి. కానీ ఈ ఫస్ట్ లుక్ ఆ అంచనాలని అందుకోలేకపోయిందనే చెప్పాలి.