ENGLISH

జెర్సీ ద‌ర్శ‌కుడితో... చెర్రీ!

29 December 2020-16:00 PM

కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డానికి స్టార్ హీరోలు ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. ఐడియా బాగుంటే చాలు... స్టార్ డ‌మ్ గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే కొత్త కాంబినేష‌న్లు చూసే అవ‌కాశం ద‌క్కుతోంది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కొత్త ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

 

ప్ర‌స్తుతం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్‌. `ఆచార్య‌`లోనూ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ తో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ పూర్త‌యిపోతుంది. ఆ త‌ర‌వాత కొత్త సినిమా మొద‌లెట్టొచ్చు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌ర‌ణ్ మ‌రో కొత్త సినిమా అంగీక‌రించ‌లేదు. ఇప్పుడు ఆ అవ‌కాశం ఓ యువ ద‌ర్శ‌కుడికి ఇచ్చిన‌ట్టు స‌మాచారం. త‌నే... గౌత‌మ్ తిన్న‌నూరి. `మ‌ళ్లీ రావా`, `జెర్సీ` సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు గౌత‌మ్‌. `జెర్సీ` ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఆ త‌ర‌వాత గౌత‌మ్ చ‌ర‌ణ్‌తో ఓసినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఇటీవ‌ల గౌత‌మ్ - చ‌ర‌ణ్‌ల భేటీ జ‌రిగింద‌ని టాక్‌. గౌత‌మ్ చెప్పిన ఐడియా.. చ‌ర‌ణ్ కి బాగా న‌చ్చింద‌ని 2021లో చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈసినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

ALSO READ: మోనాల్ కొట్టింది సూప‌ర్ ఛాన్సు