ENGLISH

‘జబర్ధస్త్’ ఆఫర్ కొట్టేసిన హరితేజ

12 October 2017-17:49 PM

బిగ్ బాస్ మొదటి సీజన్ తో కావలసినంత ఫేంని బ్యాంక్ అకౌంట్ లో వేసేసుకున్న హరితేజ. ఇక ఆ ఫేం తోనే బుల్లితెర పైన ఒక బంపర్ ఆఫర్ చేజిక్కిచుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే, జబర్ధస్త్ కామెడీ షోకి ఇద్దరు వ్యాఖ్యాతల్లో ఒకరైన రశ్మిని తప్పించి ఆ స్థానంలో హరితేజని తీసుకుంటున్నారట! దీనికి కారణం- బిగ్ బాస్ తో హరితేజ కి బాగా ఫేం రావడం అదే విధంగా రష్మీ త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా వెళ్ళనుండడం కూడా ఈ మార్పుకి కారణం అన్న వార్తలు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి.

అయితే వీటికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే గనుక నిజం అయితే, బిగ్ బాస్ తరువాత బంపర్ ఆఫర్ కొట్టేసింది అనుకోవచ్చు.

 

ALSO READ: తెలంగాణా నుండి రకుల్ ప్రీత్