ENGLISH

పాపం ప్రభాస్‌.. అది తగ్గించడం సాధ్యమేనా?

17 September 2020-10:00 AM

‘బాహుబలి’ తర్వాత ఓ మామూలు సినిమా చేద్దామనుకున్న రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కి, ‘సాహో’ మరింత పెద్ద సినిమాగా మారింది. ప్రభాస్‌పై క్రియేట్‌ అవుతున్న హైప్‌ అలాంటిది మరి. ‘సాహో’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ప్రభాస్‌ నుంచి వచ్చే తదుపరి సినిమా ‘రాధేశ్యామ్’పై అంతకు మించిన హైప్‌ ఇప్పటికే క్రియేట్‌ అయిపోయింది. కానీ, ప్రభాస్‌ మాత్రం లిమిటెడ్‌ బడ్జెట్‌తో ఓ మూవీ చేయాలని అనుకుంటున్నాడట.

 

అయితే, అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ప్రభాస్‌ నుంచి రాబోయే సినిమాలన్నీ పాన్‌ ఇండియా సినిమాలే అవుతున్నాయి. ఆయనకున్న క్రేజ్‌ నేపథ్యంలో.. ప్రతి సినిమా 200 కోట్లు ఆపైన బడ్జెట్‌.. అనే స్థాయిలోనే ప్లానింగ్‌ జరగాల్సి వస్తోంది. అభిమానుల అంచనాల్ని కాదని ప్రభాస్‌ సైతం ఏం చేయలేడు కదా.! అదే అసలు సమస్య. ఇక, ఈ కారణంగా ప్రభాస్‌ నుంచి ఎక్కువ సినిమాలు రాలేకపోతున్నాయి. సినిమా సినిమాకీ చాలా గ్యాప్‌ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి, ‘సాహో’ తర్వాత రానున్న ‘రాధేశ్యామ్‌’కి కూడా లిమిటెడ్‌ బడ్జెట్‌ అనుకున్నారట.

 

అదిప్పుడు అనుకోకుండా భారీబడ్జెట్‌ సినిమాగా.. పాన్‌ ఇండియా సినిమాగా మారిపోయింది. కరోనా దెబ్బ కొట్టకపోయి వుంటే, ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్‌ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేసేదే. కరోనా దెబ్బతో ‘రాధేశ్యామ్’ సినిమా ఇంకాస్త వెనక్కి వెళుతోంది. ఈ ఏడాదిలో సినిమా విడుదలయ్యే పరిస్థితి లేదు. ఇక ‘ఆదిపురుష్‌’ సంగతి సరే సరి. అది, ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా కాబోతోంది.

ALSO READ: సంక్రాంతి పుంజులు రెడీ అవుతున్నాయి.