ENGLISH

బెల్లీ బ్యూటీ ఇలియానాకి కోపమొచ్చింది

14 March 2018-07:30 AM

పర్సనల్‌ ఇష్యూస్‌ జోలికి వస్తే, కొందరు సెలబ్రిటీస్‌ చాలా ఘాటుగా స్పందిస్తారు. 

తాజాగా అలాంటి అనుభవం ఇలియానా విషయంలో రిపోర్టర్స్‌కి ఎదురైంది. ముద్దుగుమ్మ ఇలియానా తన బోయ్‌ ఫ్రెండ్‌ అయిన ఆండ్రూనీబోన్‌ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చిన విషయం గతంలో తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే, పర్సనల్‌ లైఫ్‌ గురించి మీడియాతో ప్రస్థావించడం తనకు అస్సలు ఇష్టం లేదనీ, అయితే సోషల్‌ మీడియాలో అభిమానులతో మాత్రం పంచుకుంటాననీ ఇలియానా చెబుతోంది. ఎందుకంటే కలిసి కనిపిస్తే పెళ్లంటారు, కనిపించకపోతే, విడిపోయారంటారు.. మీడియా దృష్టి కోణం ఈ రకంగా ఉంటుంది అని ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

అసలు ఇలియానాకి ఎందుకింత ఫ్రస్టేషనో తెలియడం లేదు. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఇలియానికిప్పుడు తెలుగులో అస్సలు అవకాశాలు రావడం లేదు. ఎంత ట్రై చేసినా ఇలియానాని తెలుగులో పట్టించుకొనేవారు లేరు. ఒకవేళ అందుకే ఇలియానా ఇంత ఫ్రస్టేషన్‌ ఫీల్‌ అవుతోందా? ఏమో ఆమెకే తెలియాలి. మొన్నామధ్య సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు, వీడియోలతో రెచ్చిపోయింది. అది చూసైనా ఇలియానాకి అవకాశాలు రాలేదు. 

ఇకపోతే బాలీవుడ్‌లోనూ ఇలియానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అరా కొరా సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇలియానా 'రెయిడ్‌' చిత్రంతో నటిస్తోంది. అజయ్‌ దేవగన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌తోనే ప్రస్తుతం ఇలియానా బిజీగా ఉంది.

ALSO READ: నటి హన్సిక పైన నమోదు అయిన ఫిర్యాదు