ENGLISH

ఇల్లీ బేబ్‌ టచ్‌ గోల!

21 August 2017-16:05 PM

గోవా బ్యూటీ ఇలియానా ఎక్కడికో బయటికి వెళితే, ఓ అభిమాని తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడట. ఈ విషయాన్ని అమ్మడు డైరెక్ట్‌గా చెప్పకుండా, సోషల్‌ మీడియాలో క్లాస్‌ పీకింది. 'నేను కూడా మీ ఇంట్లో అమ్మాయిలాంటి దాన్నే. అంతకు మించి ఓ మహిళని. దయచేసి మహిళల్ని గౌరవించండి. బయటికి వెళ్లినప్పుడు వందలు, వేల సంఖ్యలో అభిమానులు వస్తూ ఉంటారు. వారిలో ఏ ఒక్కరో ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి అభిమానులకు చెప్తున్నా.. దయచేసి హీరోయిన్స్‌ పట్ల అలా బిహేవ్‌ చేయకండి..' అని ఇలియానా కొంచెం సాఫ్ట్‌గానే క్లాస్‌ తీసుకుందిలెండి. అలాగే తనకి అభిమానులంటే చాలా ఇష్టమనీ, వారికి ఇలా ఈ విషయంలో క్లాస్‌ తీసుకోవడం తనకు చాలా బాధాకరంగా ఉందని చెప్పింది ఇలియానా. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఒకప్పుడు నెంబర్‌ వన్‌ చైర్‌ని ఆక్యుపై చేసేసింది. స్టార్‌ హీరోలందరితోనూ జత కట్టింది. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమెకి అవకాశాలు దక్కడం లేదు. కోరి ఆడిగినా ఇలియానాని పిలిచి ఎవ్వరూ ఛాన్స్‌ ఇవ్వడం లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే గడుపుతోంది. వరుస అవకాశాలతో దూస్కెళ్తోంది. కానీ అక్కడ కూడా విజయాలు అరకొరగానే ఉన్నాయి. అందుకే అమ్మడి దృష్టి మళ్లీ టాలీవుడ్‌పై పడింది. చాలా గ్యాప్‌ వచ్చినా కానీ, తనలోని అందచందాలు ఏమాత్రం తగ్గిపోలేదనీ, ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ వీడియోలతో రెచ్చిపోయింది. ఏదేమైనా ఈ మధ్య ఇలియానా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది. ఇదీ ఒకందుకు మంచిదేలెండి. ఆమెను ఇప్పట్లో మర్చిపోకుండా ఉంటారు ఆడియన్స్‌.

ALSO READ: జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుమాధవ్..!!