గోవా బ్యూటీ ఇలియానా అంటే గ్లామర్‌కి పెట్టింది పేరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోస్ అందరితోనూ నటించి, స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. అయితే చాలా కాలంగా ఇలియానా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఈ మధ్యనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో హీటెక్కిస్తోంది. టాలీవుడ్‌పై తనకి మక్కువ పోలేదనీ, మంచి అవకాశాలొస్తే తెలుగులో సినిమాలు చేయడానికి ఇలియానా రెడీగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. కాగా బాలీవుడ్‌లో తాజాగా ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోన్న సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సినిమా పేరు 'బాద్‌షాహో'. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడింది. ఆ కాలానికి చెందిన నటిగా ఇలియానా ఈ సినిమాలో కనిపించనుంది. అజయ్‌దేవగన్, ఇమ్రాన్ హష్మి, విద్యుత్ జెంబ్వాల్, ఈషా గుప్తా తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. సెప్టెంబర్ 1న ప్రేక్షుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ఇలియానా ఫస్ట్‌లుక్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ లుక్‌లో ఇలియానాని చూడడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇలియానాది డీ గ్లామర్ రోల్. ఈ సినిమాలో పాత కాలానికి చెందిని అమ్మాయి పాత్రలో ఇలియానా కనిపించేందుకు తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకుందట. ఇంతవరకూ తాను గ్లామర్ రోల్స్‌లోనే సందడి చేసింది. తొలిసారిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపిస్తోంది ఇలియానా. ఈ గెటప్‌ని తానెంతో ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతోంది ముద్దుగుమ్మ ఇలియానా. మిలాన్ లుథిరా డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ALSO READ: బన్నీ సరసన రష్మిక, నిజమేనా?