'ఎగసి పడే అలలు, ఎదురు చూసే సముద్ర తీరాలు..' అంటూ పొయెటిగ్గా శర్వానంద్ తన ప్రియురాలి గురించి వర్ణిస్తున్న అందమైన వర్ణనతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. లాంగ్ వ్యూలో లొకేషన్స్ హైలైట్ చేశారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. చిన్నప్పటి స్కూల్, అక్కడ మొదలైన అందమైన ప్రేమ సంగతులు.. స్కూల్‌లో ఓ పిల్లాడు 'జాను ఎక్కడా.?' అని అడుగుతుండగా సమంత ఎంట్రీ.. తర్వాత మళ్లీ శర్వానంద్.. ఇలా పాస్ట్, ప్రజెంట్ సీన్స్‌ని మిళితం చేసి ఓ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు ట్రైలర్‌లో. 'ఒక్కోసారి జీవితంలో ఏమీ జరక్కుండానే ఏదో జరగబోతోందని మనసుకు ముందే తెలిసిపోతుంది.. అని సమంత చెప్పే డైలాగ్, 'పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే..' అని శర్వానంద్ చెప్పిన డైలాగులు నిజంగానే మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
టోటల్‌గా ట్రైలర్ కూల్ అండ్ ప్లజెంట్ ఫీల్‌నిస్తోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన '96'కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. స్కూల్‌లో స్టార్ట్ అయిన లవ్ స్టోరీ, కొన్ని కారణాల వల్ల విడిపోయి, మళ్లీ పెద్దయ్యాక ఓ సందర్భంలో కలవడం, అప్పుడు వారి మధ్య సాగిన లవ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ అందమైన ప్రేమకథకు తెలుగులో రూపం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు. లవ్ మంత్ ఫిబ్రవరి 7న 'జాను' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: సక్సెస్‌కి సమంత సూచనలు!