జబర్‌దస్త్ అనే టీవీ షోతో బాగా పాపులర్ అయిపోయాడు రాం ప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్‌లో తాను కీలక సభ్యుడు. ఆ స్కిట్స్‌ని తనే రాస్తుంటాడు. ఆటో పంచ్‌లతో చాలాఆ స్కిట్లు గెలిపించాడు. ఇది వరకు కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించిన రాం ప్రసాద్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. సుడిగాలి సుధీర్ టీమ్‌లోని, సుధీర్, శ్రీనులతో కలిసి హీరోగా ఓ సినిమా చేశాడు. అదే త్రీమంకీస్. ఈవారంలోనే ఈ సినిమా విడుదల అవుతోంది. అయితే.. నటుడిగా, రచయితగానే కాకుండా తనలోని మరో కోణాన్నీ బయటపెట్టాలని చూస్తున్నాడు.
రాంప్రసాద్‌కి మెగాఫోన్ పట్టాలని వుందట. డైరెక్టర్‌గా తనని తాను నిరూపించుకోవాలని చూస్తున్నానని ఈ హాస్యనటుడు చెబుతున్నాడు. రచయితగా తనకు మంచి పట్టుంది. ఇది వరకు కొన్ని సినిమాల్లో కొన్ని కామెడీ బిట్స్ రాశాడు. ఓ రకంగా జబర్ దస్త్‌లోని తన స్కిట్స్‌కి తానే దర్శకుడు. ఆ అనుభవంతోనే సినిమాకి దర్శకత్వం వహించాలని ఉబలాటపడుతున్నాడు. మరి రాంప్రసాద్‌కి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి.
ALSO READ: డబుల్ హ్యాట్రిక్ కోసం.. మళ్లీ మరోసారి!