ENGLISH

'జై' పాత్రలో ఎన్టీఆర్‌ కుమ్మేశాడంతే

21 September 2017-16:11 PM

'జై లవకుశ' సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చాలా బాగుందంటూ అభినందనలు జోరు మొదలైంది. సోషల్‌ మీడియాలో పలువురు సెలబ్రిటీస్‌ ఎన్టీఆర్‌ని ప్రశంసిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. అందులో భాగంగా జక్కన్న రాజమౌళి సోషల్‌ మీడియాల స్పందించారు. ఎన్టీఆర్‌ అద్భుతమైన నటన కనబరిచాడంటూ ప్రశంసించారు. అలాగే చాలా మంది సెలబ్రిటీస్‌ ఎన్టీఆర్‌ సూపర్‌, అదుర్స్‌ అంటూ ట్వీట్స్‌ వర్షం కురిపిస్తున్నారు. ఆయన నటనకు ఫిదా అయిపోతున్నారు. ఆశించనట్లే 'జై' పాత్ర సినిమాకి ప్రాణం. ఆ పాత్రే కీలకం కూడా. ముగ్గురు పాత్రల్లోనూ ఎన్టీఆర్‌ ఇరగదీసేశాడు. అభిమానులు ఆయన్ని అలా చూసి ఆనందంతో ఉరకలేస్తున్నారు. వరుస విజయాలతో దూస్కెళ్తోన్న ఎన్టీఆర్‌ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ఎన్టీఆర్‌కిది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాని నిర్మించారు. ధియేటర్‌ నుండి బయటికి వచ్చాక 'జై' పాత్ర గురించే చర్చించుకుంటున్నారంతా. అంత బాగా ప్రభావితం చేసింది ఆ పాత్ర. అంతేకాదు ఎన్టీఆర్‌ని కూడా ఆ పాత్ర అంత బాగా ప్రభావితం చేసిందట. ఇంతవరకూ ఎన్టీఆర్‌ టచ్‌ చేయని క్యారెక్టర్‌ 'జై' పాత్ర. తొలి సారిగా ప్రయత్నం చేశాడు సక్సెస్‌ అయ్యాడు. రావణా జై జై జై.. భలే చేశావయ్యా తారకా జై జై జై!

 

ALSO READ: జై లవకుశ మూవీ రివ్యూ & రేటింగ్స్