ENGLISH

జ‌న‌గ‌ణ‌మ‌న‌లో జాన్వీ క‌పూర్‌?

31 March 2022-14:04 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ప‌ట్టాలెక్కేసింది. లైగ‌ర్ చేతిలో ఉండ‌గానే.. `జ‌గ‌న‌ణ‌మ‌న‌`కి శంఖారావం పూరించాడు పూరి. ముంబైలో ఈ సినిమా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఇది పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ఇందులో కొంత‌మంది బాలీవుడ్ స్టార్లు క‌నినిపించ‌డం ఖాయం. హీరోయిన్ ని అయితే అక్క‌డి నుంచి తీసుకోవాల్సిందే. మ‌రో మార్గం లేదు. హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. ఆమె దాదాపుగా క‌న్‌ఫామ్ అని టాక్‌.

 

జాన్వీ ఎంట్రీ గురించి టాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. అదిగో.. ఇదిగో.. జాన్వీ వ‌చ్చేస్తోంది అని చెప్పేవారే అంతా. కానీ.. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో ఓ సినిమా కూడా చేయ‌లేదు. `లైగ‌ర్‌`లో ముందు జాన్వీ పేరే ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కానీ కుద‌ర్లేదు. ఈసారి ఎలాగైనా జాన్వీని ప‌ట్టేయాల‌ని.. పూరి భావిస్తున్నాడ‌ట‌. అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా మొద‌లయ్యాయ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే హీరోయిన్ పేరు అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని చూస్తోంది చిత్ర‌బృందం. మ‌రి ఈసారైనా జాన్వీ పేరు ఉంటుందో, లేదో?

ALSO READ: గ‌నికి మంచి బేరం కుదిరింది