ENGLISH

Janhvi Kapoor: జాన్వీ రెడీ.... మ‌రి ఎన్టీఆర్‌?

04 November 2022-13:02 PM

జాన్వీ క‌పూర్ టాలీవుడ్ తెరంగేట్రం గురించి చాలా కాలంగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` కి సీక్వెల్ ఉంటుంద‌ని, ఆ సినిమాతో జాన్వీ టాలీవుడ్ లో అడుగు పెడుతుంద‌ని అనుకొన్నారు. అది జ‌ర‌గ‌లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జాన్వీ న‌టించ‌డం ఖాయ‌మ‌న్నారు. అదీ అవ్వ‌లేదు. అయితే... ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ అనే ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌రిగింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించే చిత్రంలో జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌న్న ఊహాగానాలు బ‌లంగా వినిపించాయి. అయితే.. జాన్వీ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకోలేద‌ని, అందుకే ఈ కాంబో కుద‌ర‌ల్లేద‌ని ఆ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. అయితే ఇప్పుడు జాన్వీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తెలుగులో న‌టించ‌డానికి తాను సిద్ధంగాఉన్నాన‌ని, ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించ‌డానికి ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది.

 

''ఎన్టీఆర్ ఓ లెజెండ్‌. త‌న‌తో క‌లిసి న‌టించే అవకాశం వ‌స్తే ఎవ‌రు మాత్రం వ‌దులుకొంటారు. నేను అలాంటి అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నా'' అని చెప్పేసింది జాన్వీ. సో.. ఇప్పుడు బంతి కొర‌టాల శివ చేతుల్లోనే ఉంది. జాన్వీని ఎన్టీఆర్ చిత్ర‌బృందం ఇప్ప‌టి వ‌ర‌కూ సంప్ర‌దించ‌లేద‌ని జాన్వీ మాట‌ల‌తో తేలిపోయింది. ఎన్టీఆర్ - జాన్వీ కాంబో.. సెట్ట‌యితే, ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. సో.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రెడీ అంటే.. జాన్వీ టాలీవుడ్ తెరంగేట్రం ఫిక్స‌యిపోయినట్టే.

ALSO READ: బనారస్ మూవీ రివ్యూ & రేటింగ్!