ENGLISH

నటి ఇంటి వద్ద ఆమె బంధువులు హల్చల్!

11 June 2017-13:40 PM

మాజీ నటి, దివంగత ముఖ్యమంత్రి అయిన జయలలిత ఆస్తుల విషయమై ఇప్పుడు తమిళనాట జోరుగా చర్చ నడుస్తున్నది. ఆమెకి వారసులు ఎవరు లేకపోవటం, అలాగే ఆమె కూడా తన తరువాత ఆస్తులు ఎవరికి చెందాలి అనే దాని పై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ గందరగోళం ఏర్పడింది.

అయితే ఈ రోజు ఉదయం ఉన్నట్లుండి ఆమె మేనకోడలు దీప కొంతమంది అనుచరులతో జయలలిత అధికారిక నివాసం అయిన పోయెస్ గార్డెన్స్ లోని వేదవల్లి దగ్గరకి చేరుకుని ఆ ఇంటిలోనికి ప్రవేశించాలి అని ప్రయత్నించారు.

అక్కడ ఉన్న పోలీసులు మాత్రం ఈ ప్రయత్నాన్ని ఆపడంతో, అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉత్కంట నెలకొంది. జయలలితకు తానే వారసురాలినంటూ దీప నినాదాలు చేసింది.

ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం అధీనంలో ఉన్న ఈ నివాసం పై ఎవరు హక్కుదారు అవుతారు అనే దాని పై సస్పెన్స్ కొనసాగుతుంది.

 

ALSO READ: అది నాకు ఎప్పట్టికీ తీరని లోటు: చిరంజీవి