'రంగస్థలం' నుండి అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఆ సాంగ్ రానే వచ్చింది. అదే పూజా హెగ్దే నటించిన స్పెషల్ సాంగ్. 'జిగేల్ రాణీ..' చిత్ర యూనిట్ ఈ పాటని తాజాగా విడుదల చేసింది. ఇలా విడుదలైందో లేదో, యూ ట్యూబ్‌లో దుమ్ము దుమారమైపోయిందీ సాంగ్. ఇంతవరకూ మూడు సాంగ్స్ వచ్చాయి. మూడు సాంగ్స్ దేనికవే అన్నట్లున్నాయి. ఇక ఈ నాలుగో పాట అయితే మాటల్లేవ్. మాట్లాడుకోవటాల్లేవ్ అన్నట్లే ఉంది. సుకుమార్ ఐటెం సాంగ్స్‌లో మరోసారి తన టేస్ట్ ఇది అని ప్రూవ్ చేసి చూపించాడు.
90ల నాటి సినిమా కదా 'రంగస్థలం'. అందుకు తగ్గట్లుగానూ ఈ ఐటెం సాంగ్ కూడా కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సాంగ్ ప్రోమోలో పూజా హెగ్దే మాస్ ఎక్స్‌ప్రెషన్స్ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతవరకూ పూజా హెగ్దేని అల్రా మోడ్రన్, అండ ట్రెడిషనల్ లుక్స్‌లోనే చూశాం. అలాంటిది 'జిగేల్ రాణీ'గా ఫేస్‌లో మాస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పిచ్చెక్కించేస్తోంది. అవును నిజమే ఖచ్చితంగా సినిమాకి ఈ సాంగ్ స్పెషలే. ఆనాటి సిల్క్ స్మిత తదితర ఐటెం గాళ్స్ నటించిన ఐటెం సాంగ్‌ని తలపిస్తోందీ 'జిగేల్ రాణీ' పాట.
మధ్యలో మధ్యలో మాస్ డైలాగ్స్‌తో సూపర్బ్‌గా ఎట్రాక్ట్ చేస్తోందీ సాంగ్. ఇక 'రంగస్థలం' నుండి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌గా చెప్పబడుతున్న జగపతిబాబు, అనసూయ భరద్వాజ్ క్యారెక్టర్స్ మాత్రమే రిలీజ్ కావల్సి ఉంది. చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత, జిగేల్ రాణిగా పూజా హెగ్దే, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చేశాయి. ఇక నెక్స్ట్ ఎంట్రీ హాట్ బ్యూటీ అనసూయదేనేమో చూడాలిక.
ALSO READ: పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అందుకే ఆపేశాడు..