ENGLISH

'జై' పాత్రతో బాగా కనెక్ట్‌ అయ్యాడట

19 September 2017-12:08 PM

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతోన్న సినిమా 'జై లవకుశ'. మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. మూడు వేరియేషన్స్‌లో కుశ, లవ పాత్రలు తనకు గత చిత్రాలతో కనెక్ట్‌ అయ్యి ఉంటాయి. కానీ 'జై' పాత్ర మాత్రం కొత్తగా ఉంటుందనీ అంటున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. 'యమదొంగ'లోని పాత్ర తరహాలో 'కుశ' ఉంటాడు, 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని తన పాత్రని 'లవ'తో పోల్చుకున్నాడు ఎన్టీఆర్‌. కానీ 'జై'ని మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ పోషించిన పాత్రతో పోల్చలేనని చెప్పాడు. అందుకే 'జై' బాగా నచ్చిన పాత్ర అట. అలాగే ఈ పాత్రతో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా అసురా అసురా.. అంటూ పిల్లలు బాగా కనెక్ట్‌ అవుతున్నారు ఈ క్యారెక్టర్‌కి. అందులోనూ ఈ పాత్రకి కొద్దిగా నత్తి ఉండడం మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. ఇవన్నీ ఈ పాత్ర చిత్రీకరణకి ప్లస్‌ పాయింట్స్‌ అని చెప్పొచ్చు. జై పాత్ర తీరు ఇలా ఉంటే, మిగతా పాత్రలు కూడా తక్కువేమీ కాదంటున్నాడు ఎన్టీఆర్‌. ఏ పాత్రకి ఆ పాత్రే చాలా ఇష్టపడి, కష్టపడి చేశాననీ అంటున్నాడు. ఈ తరం హీరోల్లో త్రిపాత్రాభినయంలో కనిపించింది ఇంతవరకూ ఎవరూ లేరు. తొలి సారిగా ఆ ప్రయత్నం చేసింది ఎన్టీఆరే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముద్దుగుమ్మ నందితా గెస్ట్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ గురువారం 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: నేనే నమ్మలేకపోతున్నా అని అనేసిన ఎన్టీఆర్!