ENGLISH

ఎన్టీఆర్ ‘హాలిడే’

03 October 2017-13:16 PM

ఎన్టీఆర్ కి 2017 సంవత్సరం బాగా కలిసొచ్చింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే- ఇటు వెండితెరపై జై లవకుశ చిత్రంతో అటు బుల్లితెర పై బిగ్ బాస్ వ్యాఖ్యాతగా ఏకకాలంలో సక్సెస్ కొట్టాడు.

జై లవకుశ ప్రచార కారక్రమాలలో కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ గత కొన్ని నెలలు తాను చాలా బిజీగా అలాగే ఒత్తిడితో పనిచేసినట్టు చెబుతూ త్వరలోనే ఒక హాలిడేకి ప్లాన్ చేయనున్నట్టు తెలిపాడు.

ఇక జై లవకుశ చిత్రం విజయవంతం కావడం రూ 100 కోట్ల మార్కుని దాటేసిన తరుణంలో తారక్ తన కుటుంబంతో కలిసి విదేశాలు వెళ్ళినట్టు సమాచారం. సుమారు 6 నెలల నుండి తాను పడిన శ్రమకి చిన్న విశ్రాంతి లాగా కూడా ఈ హాలిడే ఉపయోగపడనుంది అన్న నేపధ్యంలో ఈ హాలిడే ప్లాన్ చేసినట్టు సమాచారం.

 

ALSO READ: ‘జై’ స్కోర్ 125 నాట్ అవుట్!