ENGLISH

ఎన్టీఆర్‌ వాళ్లందర్నీ గెలిపించాడు

26 September 2017-11:47 AM

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బుల్లితెర బిగ్‌ గేమ్‌ షో 'బిగ్‌బాస్‌' మొదటి సీజన్‌కి విన్నర్‌గా హీరో శివబాలాజీ నిలిచారు. అయితే హౌస్‌ మేట్స్‌ అంతా, ఈ విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. మేమంతా 'బిగ్‌బాస్‌' విజేతలమే అని వారంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇదో గేమ్‌ షోలాగా కాకుండా జీవితాన్ని అర్ధం చేసుకునే అవకాశం తమకి 'బిగ్‌బాస్‌' షో ద్వారా కలిగిందని సంతృప్తి చెందుతున్నారు హౌస్‌ మేట్స్‌ అంతా. భిన్న మనస్తత్వాలు కలిగిన భిన్న మనుషుల మధ్య 70 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో భావోద్వేగాలు మరెన్నో తీపి గురుతులు.. ఇలా నిజమైన జీవితాన్ని మేమీ షో ద్వారా తెలుసుకున్నామనీ హౌస్‌ మేట్స్‌ అంతా చెప్పడం విశేషం. గెలుపు ఎవరిదనేది పక్కన పెడితే, మొదటి ఎలిమినేషన్‌ అయిన హౌస్‌ మేట్‌ జ్యోతి నుండి, లాస్ట్‌ ఎలిమినేట్‌ అయిన ఆదర్శ్‌ వరకూ కూడా ఇదే మాట చెబుతుండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తాము ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నామనీ, ఈ షో ద్వారా ఈ అవకాశం కలిగినందుకు హౌస్‌ మేట్స్‌ ఎన్టీఆర్‌కీ, ఆడియన్స్‌కీ ధన్యవాదాలు తెలుపుకున్నారు. హోస్ట్‌గా ఎన్టీఆర్‌కి ఈ విషయంలో చాలా రుణపడి ఉంటామనీ అన్నారు. వీకెండ్‌లో వస్తూ, వీక్‌ మొత్తంలో తాము చేసిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ, వాటిని సరిదిద్దుకునే మార్గ నిర్దేశం కూడా చూపుతూ, జీవితం విలువను తెలియచెప్పిన ఎన్టీఆర్‌ మాకు పెద్దన్నలా వ్యవహరించారనీ ఆయన రుణం ఎప్పటికీ తీరదనీ బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌ అంతా చెప్పారు. బిగ్‌బాస్‌ షో నిర్వహించిన ఎన్టీఆర్‌కి ఇంతకన్నా గొప్ప అభివాదం, గొప్ప గెలుపు ఇంకేముంటుంది చెప్పండి. హౌస్‌ మేట్స్‌ మనసునే కాదు, ఆడియన్స్‌ మనసునీ ఎన్టీఆర్‌ అలాగే గెలిచేసుకున్నాడు. దటీజ్‌ 'బిగ్‌బాస్‌' !

ALSO READ: మహేష్ స్పైడర్ ప్రీ-రిలీజ్ టాక్