ENGLISH

హాట్‌ లుక్స్‌తో అదరగొట్టేస్తున్నావ్‌ కాజల్‌

15 March 2018-10:57 AM

'టెంపర్‌' సినిమాలో తమ్ముడు ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ అదరగొట్టేసింది. తాజాగా అన్న కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కెమిస్ట్రీ కెవ్వుకేక పుట్టిస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో యంగ్‌ హీరో రానాతోనూ కాజల్‌ కెమిస్ట్రీ బాగా పండించింది. రానా పాత్రలో హుందా లుక్స్‌లోనూ గ్లామర్‌ అప్పీల్‌ కనిపించేలా జాగ్రత్త పడింది. ఇప్పుడు 'ఎమ్మెల్యే' సినిమాలో కూడా కాజల్‌ - కళ్యాణ్‌రామ్‌ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుండేలా ఉందని, స్టిల్స్‌, పోస్టర్స్‌ ద్వారా తెలుస్తోంది. 

యంగ్‌ హీరోస్‌తోనూ, సీనియర్‌ హీరోస్‌తోనూ కాజల్‌కి కెమిస్ట్రీ ఆ రేంజ్‌లో ఉంది మరి. ఎంతైనా మెగాస్టార్‌తో నటించిన మెగా భామ కదా. మెగాస్టార్‌తో రొమాన్స్‌ చేయడమంటే మాటలా. ఎంతో అదృష్టం ఉండాలి. పెట్టి పుట్టాలి. ఆ అదృష్టం కాజల్‌ని వరించింది. ఆ మెగా ఉత్సాహంతోనే కాజల్‌లో రెట్టించిన గ్లామర్‌ పెళ్లుబికి వస్తోంది. 'ఖైదీ' తర్వాత కాజల్‌లో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. ఇంతకు ముందు కన్నా ఫ్రెష్‌ లుక్స్‌తో, చాలా చాలా అందంగా కనిపిస్తోంది. అందుకే ఆమె అందానికి, ఫ్రెష్‌గా వస్తున్న ముద్దుగుమ్మలు అసూయ పడుతున్నారట.

 

వారి వద్ద లేని ఆ ఎట్రాక్షన్‌ సీనియర్‌ అయిన కాజల్‌కి ఎక్కడి నుండి వస్తుందో అని కుళ్లుకుంటున్నారట. అదే కాజల్‌ గ్లామర్‌ స్పెషాలిటీ. ఏప్రిల్‌ 23న కాజల్‌ 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. తమిళంలో మన అందాల కాజల్‌ 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌ 'క్వీన్‌' సినిమాకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది.

ALSO READ: అఖిల్‌పై వస్తున్న ఆ రూమర్స్‌ సంగతేంటి చెప్మా!