ENGLISH

నా ఇష్టాలు నాకుంటాయ్‌ కదా: కాజల్‌ అగర్వాల్‌

18 November 2020-13:00 PM

‘నా లైఫ్‌ నా ఇష్టం’ అంటోంది కాజల్‌ అగర్వాల్‌. ‘పెళ్ళి అనేది ఓ అద్భుతమైన ఘట్టం. ఓ మహిళకు చాలా చాలా ప్రత్యేకమైన సందర్భమిది. జీవితంలో ఓ పెద్ద మలుపుగా దీన్ని నేను భావిస్తున్నాను. అలాగని సినిమా కెరీర్‌కి గుడ్‌ బై చెప్పేయాల్సిన అవసరమే లేదు. నటిగా నా కెరీర్‌ని కొనసాగిస్తాను..’ అంటోంది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం భర్త గౌతంతో కలిసి విదేశాల్లో హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న కాజల్‌ అగర్వాల్‌, త్వరలోనే ‘ఆచార్య’ సినిమా షూట్‌లో జాయిన్‌ అవబోతోంది. ‘పెళ్ళయ్యాక సినిమా ఛాన్సులు తగ్గుతాయన్న మాటల్లో నిజం లేదు.

 

ఒకప్పుడు అలా జరిగేదేమో.. కానీ, ఇప్పుడలా కాదు..’ అంటోన్న కాజల్‌ అగర్వాల్‌, తానూ మరింత జోరుగా ఇకపై సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. పెళ్ళయ్యాక కూడా సమంత సినిమాల్లో నటిస్తున్న విషయాన్ని కాజల్‌ ప్రస్తావించింది. బాలీవుడ్‌లోనూ చాలామంది హీరోయిన్లు పెళ్ళయ్యాక కూడా స్టార్లుగా కొనసాగుతున్నారని చెప్పిన కాజల్‌, పెళ్ళిని కెరీర్‌కి అడ్డంకిగా తాను భావించడంలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చింది. ‘నా కెరీర్‌ గురించి నాతోపాటుగా నా భర్తకీ పూర్తి అవగాహన వుంది. ఆయన ప్రోత్సాహం ఖచ్చితంగా వుంటుంది.. ప్రొఫెషనల్‌ లైఫ్‌ని, పర్సనల్‌ లైఫ్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోగలనని నమ్మకం కుదిరాకనే పెళ్ళి చేసుకున్నాను..’ అంటున్న కాజల్‌, హనీమూన్‌ సందర్భంగా ఫొటోలకు పోజలివ్వడంపై స్పందిస్తూ ‘నా ఇష్టాలు నాకుంటాయ్‌ కదా..’ అని చెప్పింది.

ALSO READ: Kajal Latest Photoshoot