ENGLISH

కాజ‌ల్ షాక్ ఇవ్వ‌బోతోందా?

07 October 2017-11:03 AM

ఈ యేడాది కాజ‌ల్‌కి బాగానే క‌లిసొచ్చింది. ఖైది నెం.150, నేనే రాజు నేనే మంత్రితో విజ‌యాలు అందుకొని ఫామ్‌లోకి వ‌చ్చేసింది. ఇప్పుడు కాజ‌ల్ చేతిలో సినిమాల‌కు కొద‌వ‌లేదు.  ఇప్పుడు  కాజ‌ల్ తెలుగు జ‌నాల‌కు ఓ స్వీట్ షాక్ ఇవ్వ‌బోతోంద‌ని టాక్‌.  నాగార్జున కీల‌క పాత్ర పోషించిన చిత్రం 'రాజుగారి గ‌ది 2'. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, సీర‌త్ క‌పూర్ క‌థానాయిక‌లు. ఈ సినిమాలో కాజ‌ల్ కూడా ఉంద‌ట‌. అయితే... కాజ‌ల్ కేవ‌లం ఇలా క‌నిపించి అలా మాయ‌మైపోతోంద‌ని, తాను కూడా ఓ దెయ్యంలా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. అయితే చిత్ర‌బృందం మాత్రం ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. థియేట‌ర్లో కాజ‌ల్ ని చూసి షాక్ తినేలా ఆ పాత్ర తీర్చిదిద్దార‌ట‌. అందుకే ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచుతున్నార్ట‌. కాజ‌ల్ ఉందో, లేదో.. ఈనెల 13న తెలిసిపోతుంది. ఎందుంక‌టే... 'రాజుగారి గ‌ది2' విడుద‌ల‌య్యేది అప్పుడే.

ALSO READ: సంక్రాంతి బ‌రిలో... రాజ్ త‌రుణ్‌