ENGLISH

అమావాస్య చంద్రుడు గుర్తు చేస్తాడా?

17 July 2021-14:14 PM

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. త‌ను అన్ని ర‌కాల పాత్ర‌లూ చేసేశాడు. తాజాగా తాను న‌టిస్తున్న చిత్రం `విక్ర‌మ్‌`. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో క‌మ‌ల్ పాత్ర ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలున్నాయి. ఇందులో క‌మ‌ల్ గుడ్డి వాడిగా న‌టించ‌బోతున్నాడ‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. క‌మ‌ల్ ఈ త‌ర‌హా పాత్ర చేయ‌డం ఇది తొలిసారేం కాదు. గ‌తంలో `అమావాస్య చంద్రుడు`లో అంధుడిగా క‌నిపించాడు క‌మ‌ల్. అప్పుడే అంత‌ర్జాతీయ స్థాయి న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు.

 

గుడ్డివాడి పాత్ర చేయాలంటే ఏ న‌టుడైనా స‌రే, ఆ సినిమాని రిఫ‌రెన్స్ గా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మ‌రోసారి ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. విజ‌య్ సేతుప‌తి, ఫాహిద్ ఫాజ‌ల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ కలిసి నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

ALSO READ: అమ‌లాపాల్ అలిగింది