ENGLISH

కమల్ హసన్ కి బెదిరింపులు

26 September 2017-14:49 PM

లోకనాయకుడు కమల్ హసన్ రాజకీయ రంగ ప్రవేశం పై ఇప్పటికే సూచనప్రాయంగా కొన్ని సంకేతాలు ఇవ్వడంతో ఆయన పై విమర్శల పర్వం మొదలయింది.

తమిళనాడు మంత్రి ఒకరు కమల్ ని ఉద్దేశించి మాట్లాడుతూ- కమల్ హసన్ రాజకీయాల్లో రాణించలేడు అని అలాగే రాజకీయాలలో మనగలగడం అంత సులువు కాదు అని వ్యాఖ్యానించాడు. రాజకీయాలను తేలికగా అంచనా వేసి తమకి ప్రజల మద్దతు ఉందన్న బ్రమలో ఈయన కూడా నటుడు శివాజీ గణేషన్ లా తప్పుడు అంచనాతో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎదురుదెబ్బ తింటాడు అని చెప్పాడు.

దీనితో కమల్ హసన్ రాజకీయ ఎంట్రీ అంత తేలికగా సాగబోదు అన్న సంగతి తేటతెల్లమైంది. ఇంకొక మూడు నెలల్లో ఆయన రాజకీయ రంగప్రవేశం ఉండబోతున్నది అన్న వార్తల నడుమ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ALSO READ: మహేష్ స్పైడర్ చిత్రం లీక్!