ENGLISH

కమల్ హసన్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు

05 October 2017-10:21 AM

లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చే ముహూర్తం ఖరారు అయింది. నిన్న అభిమానులతో జరిగిన భేటీలో దీనికి సంబందించిన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

అయితే దీని పై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ బయట చర్చలు మాత్రం ఈ తరహాలోనే నడుస్తున్నాయి. ఆ భేటీలో వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 7వ తేదిన రాజకీయ ప్రకటన ఉండబోతుంది అన్న వార్త హల్చల్ చేస్తున్నది.

ఈ మధ్యనే రజినీకాంత్-కమల్ హసన్ ఒకే వేదిక పంచుకోవడం అలాగే వారి మధ్య రాజకీయ ప్రవేశం గురించిన చర్చ కూడా బహిరంగానే జరగడంతో ఈ ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం ఖాయం అయింది.

ఇక వచ్చే నెల నుండి తమిళనాట రాజకీయానికి గ్లామర్ రానున్నది.   

 

ALSO READ: పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌