ENGLISH

ముందైనా వెనకైనా.. శృంగారం తప్పు కాదట!

22 November 2020-14:35 PM

పెళ్ళికి ముందైనా, పెళ్ళయ్యాక అయినా శృంగారం తప్పెలా అవుతుందని అమాయకంగా ప్రశ్నించేస్తోంది కాంగనా రనౌత్‌. ఈ విషయమై ఆమె చుట్టూ పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. అయితే, కంగనా రనౌత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే కొత్త కాదు. చాలాకాలం క్రిందటే అవకాశాల కోసం తాను ‘ఆ పని’ చేసినట్లు ఓ సందర్భంలో చెప్పింది. ‘సినీ పరిశ్రమలో ఇవన్నీ కామన్‌’ అని కూడా చెప్పింది.

 

అప్పట్లో ఓ బాలీవుడ్‌ యువ నటుడితో రొమాంటిక్‌ ట్రాక్‌ నడిపేసి, అతనితో ఎఫైర్‌ని బీభత్సంగా ముందుకు తీసుకెళ్ళి, ఫుల్లగా వాడుకున్నా వదిలేసిందన్న విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు తాజాగా ఇంకోసారి కంగనా రనౌత్‌ పెళ్ళికి ముందు శృంగారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో ఇంకోసారి దుమారం రేగింది. అయితే, ఎవరి ఇష్టం వాళ్ళది. పద్ధతిగా పెళ్ళయ్యాక వైవాహిక బంధంతో రొమాంటిక్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యడమా.? లేదంటే, పెళ్ళికి ముందు ఎడా పెడా శృంగార కార్యకలాపాల్లో ఇతరులతో మునిగి తేలడమా.? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టాన్ని బట్టి వుంటుంది.

 

ఇది నేరమా.? కాదా.? అన్నదానిపై చట్ట పరంగానూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఇవన్నీ తెలిసీ ఓ సెలబ్రిటీ అయిన కంగనా రనౌత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటే, కేవలం పబ్లిసిటీ స్టంట్‌ కోసమే. ఆమె కోరుకున్న స్థాయిలో వ్యతిరేకతని ఆమె ఎదుర్కొంటోంది. కొంతమందికి అదో సరదా.. తిట్టించుకోవడంలో వున్న మజా కంగనా లాంటోళ్ళకే బాగా తెలుసేమో.!

ALSO READ: Kangana Latest Photoshoot