ENGLISH

Kantara Collections: కాంతార‌... క‌ల‌క్ష‌న్ల వాన‌!

17 October 2022-10:49 AM

ఎలాంటి అంచ‌నాలూ లేకుండా విడుద‌లైన సినిమా `కాంతార‌`... తెలుగులో క‌ల‌క్ష‌న్ల వాన కురిపిస్తోంది. శ‌నివారం ఈ సినిమా విడుద‌లైంది. తొలి రోజు.. తొలి షోకే.. `సూప‌ర్` టాక్ సంపాదించుకొంది. రివ్యూలు కూడా ఈ సినిమా అదిరిపోయింద‌నే రాశాయి. దాంతో.. మౌత్ టాక్ తో ఈ సినిమాకి మంచి క‌ల‌క్ష‌న్లు వ‌చ్చాయి. రెండు రోజుల‌కు గానూ... రూ.10.5 కోట్లు సంపాదించిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమా హ‌క్కుల్ని కొనుగోలు చేసి, విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి రోజే గీతా ఆర్ట్స్ పెట్టుబ‌డి మొత్తం తిరిగి వ‌చ్చేసింద‌ని టాక్‌. రెండో రోజుకి రెట్టింపు లాభాల్ని సంపాదించింది. ఈమ‌ధ్య కాలంలో ఓ డ‌బ్బింగ్ సినిమా ఈ స్థాయిలో లాభాల్ని తెచ్చుకోవ‌డం ఇదే.

 

రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌కత్వం వ‌హించి, హీరోగా న‌టించిన సినిమా ఇది. క‌న్న‌డ‌లో పెద్ద హిట్ అయ్యింది. అక్క‌డ దీన్ని ఓ క్లాసిక్ గా అభివ‌ర్ఱిస్తున్నారు. వంద కోట్ల మైలు రాయి కూడా చేరుకొంది. తెలుగులో కూడా ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా టోట‌ల్ ర‌న్ లో రూ.20 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. రిష‌బ్ శెట్టి సినిమాలేవీ తెలుగులో విడుద‌ల కాలేదు. త‌న‌కు ఇదే తొలి సినిమా.తొలి సినిమాతోనే తెలుగులో జాక్ పాట్ కొట్టాడు రిష‌బ్‌.

ALSO READ: Kantara Review: ‘కాంతార’ మూవీ రివ్యూ & రేటింగ్!