ENGLISH

కరాటే కళ్యాణిని అందుకే ఎగదోస్తున్నారా?

09 September 2020-16:00 PM

బిగ్‌ హౌస్‌లో ఏదీ స్క్రిప్ట్‌ ప్రకారం జరగదని నిర్వాహకులు ఎంతగా ‘కవరింగ్‌’ ఇచ్చుకుంటున్నప్పటికీ, అక్కడ అంతా స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతుంటుందని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో తమన్నా సింహాద్రి ఎంట్రీనే అత్యంత నాటకీయ పరిణామం. అప్పట్లో తమన్నా బిగ్‌ హౌస్‌లో చేసిన యాగీ అంతా స్క్రిప్టెడ్‌ వ్యవహారమేనన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు హౌస్‌లో కరాటే కళ్యాణి హడావిడి కూడా అలానే తలపిస్తోంది.

 

చీటికీ మాటికీ చిరాకు పడటం, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఓవర్‌ యాక్టింగ్‌ చేసేస్తుండడంపై సోషల్‌ మీడియా వేదికగా చాలా కామెంట్స్‌ పడుతున్నాయి. గత సీజన్లలో చాలామంది చాలా నెగెటివిటీని బిగ్‌ హౌస్‌ నుంచి తమతో బయటకు తీసుకొచ్చారు. ఈసారి కూడా అదే పరిస్థితి వుంటుందేమో. రియల్‌ లైఫ్‌లో కరాటే కళ్యాణి హైపర్‌ యాక్టివ్‌. బీభత్సమైన గొంతేసుకుని విరుచుకుపడిపోతుంటుంది ప్రత్యర్థుల మీద. ఇక్కడ బిగ్‌ హౌస్‌లో కూడా ఆమె అదే చేస్తోంది.

 

అబిజిత్‌పైనా ఇతర కంటెస్టెంట్లపైనా కళ్యాణి విరుచుకుపడుతున్న వైనం, ఆయా కంటెస్టెంట్ల పట్ల పాజిటివ్‌ మైండ్‌సెట్‌ వ్యూయర్స్‌లో క్రియేట్‌ అయ్యేలా చేస్తోంది. నిన్నటి గొడవ, మొన్నటి గొడవ.. ఇవన్నీ కళ్యాణికి మాత్రం చాలా బ్యాడ్‌ నేవ్‌ు తెచ్చేస్తున్నాయి. ఈ గొడవల కారణంగానే ఆమెను ఏ క్షణాన అయినా ఎలిమినేట్‌ చేసెయ్యచ్చని కూడా అంటున్నారు.

ALSO READ: ప్రముఖ బుల్లితెర నటి ఆత్మహత్య!